
తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విడుదల చేసిన డేటా ప్రకారం. జనవరి 1వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు 5372 కేసులు నమోదయ్యాయి. అయితే.. హై రిస్క్ డెంగ్యూ కేసులు హైద్రాబాద్ లో 1,852 నమోదు కాగా.. సూర్యాపేట 471, మేడ్చల్ మల్కాజిగిరి 426, ఖమ్మం 375, నల్గొండ 315, నిజామాబాద్ 286, రంగారెడ్డి 232, జగిత్యాల 185, సంగారెడ్డి 160, వరంగల్ 110 డెంగ్యూ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా చికెన్ గునియా 152 కేసులు నమోదు కాగా.. మలేరియా 191 కేసులు నమోదైనట్లు డేటా విడుదల చేశారు. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే లో ఒక కోటి 42 లక్షల 78వేల 723 ఇల్లు సందర్శించారు.. అందులో 2లక్షల 65వేల 324 జ్వరాలు అన్నట్టు గుర్తించారు..
Annamalai: “సూపర్ స్టార్ రజనీకాంత్ వాస్తవాలు చెప్పారు”.. స్టాలిన్ పై అన్నామలై సంచలన విమర్శలు