- కామారెడ్డిలో విషాదం
- డెంగ్యూతో 12 ఏళ్ల బాలిక మృతి
- మూడు రోజుల క్రితం బాలుడు మృతి

Dengue Fever in Bhoompally Village: కామారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన మనశ్రీ (12) అనే బాలిక డెంగ్యూ జ్వరం బారిన పడి మృతి చెందింది. నాలుగు రోజుల క్రితం మనశ్రీకి తీవ్ర జ్వరం రాగా.. కుటుంబసభ్యులు స్థానికంగా చికిత్స చేయించారు. అయినా కూడా మనశ్రీకి జ్వరం తగ్గలేదు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా మృతి చెందింది.
మూడు రోజుల క్రితం భూంపల్లి గ్రామానికి చెందిన రంజిత్ (9) అనే బాలుడు కూడా డెంగ్యూ జ్వరంతో కన్నుమూశాడు. గాంధారి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇద్దరి మృతితో భూంపల్లి గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భూంపల్లి గ్రామాన్ని డెంగ్యూ వ్యాధి పట్టిపీడిస్తోంది. విష జ్వరాలతో ఇంటికొకరు మంచం పట్టారు. వెంటనే వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.