Leading News Portal in Telugu

Crime News: నల్లగొండ జిల్లాలో దారుణం.. కన్నతల్లి గొంతుకోసి హత్య చేసిన కొడుకు!


  • నల్లగొండ జిల్లాలో దారుణం
  • కన్నతల్లిని హత్య చేసిన కొడుకు
  • గొడవల కారణంగానే హత్య
Crime News: నల్లగొండ జిల్లాలో దారుణం.. కన్నతల్లి గొంతుకోసి హత్య చేసిన కొడుకు!

Nidamanur Crime News: నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లిని కొడుకు కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం అదే కత్తితో గొంతు కోసుకొని బలవన్మరణానికి పాలపడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిడమనూరు మండల కేంద్రంలో ఉండే రావిరాల సాయమ్మ (65)కు కొడుకు రావిరాల శివ (36) ఉన్నాడు. శివ తన తల్లి సాయమ్మతో కలిసి ఉంటున్నాడు. ఏడాది క్రితం శివకు వివాహం కాగా.. ఇటీవలే విడాకులు అయ్యాయి. దాంతో గత కొన్ని రోజుల నుంచి తల్లి, కొడుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో.. తల్లి సాయమ్మను కుమారుడు శివ కత్తితో గొంతుకోసి చంపాడు. అనంతరం అతడు గొంతుకోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శివ మానసికస్థితి సరిగా లేదని బంధువులు అంటున్నారు.