- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ లో విషాదం..
-
నాలుగు రోజుల్లో పెళ్లి.. అంతలోనే పెళ్లి కూతురు ఆత్మహత్య.. -
కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్న పోలీసులు..

Bride Suicide: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన బటికె సంపత్ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే, గతంలో పెద్ద కూతురు వివాహం చేయగా.. చిన్న కూతురైన కోమల (25) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇంట్లో ఉంటుంది.. దీంతో ఆమెకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే మూడేళ్ల క్రితం కోమలకు పెళ్లి సంబంధం కుదుర్చి వర పూజ కూడా చేశారు.. కానీ కోమల తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో ఆ సంబంధాన్ని కుటుంబ సభ్యులు రద్దు చేసుకున్నారు.
ఇక, ఇటీవల పోచారం గ్రామానికి చెందిన యువకుడితో మరో సారి కోమలకు పెళ్లి సంబంధాన్ని కుదుర్చారు. ఈ నెల 28వ తేదీన ఘనంగా వివాహం చేయాలని కోమల తల్లిదండ్రులు నిర్ణయించారు. ఇక, పెళ్లికి సమయం దగ్గర పడుతుండటంతో పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు. కాగా, నిన్న ( శనివారం) రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో కోమల ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆత్మహత్య చేసుకున్న కూతురిని చూసిన తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు.