- ‘హైడ్రా’ హైదరాబాద్ వరకే పరిమితం..
-
ఎఫ్టీఎల్- బఫర్ జోన్- పార్కులు- నాలల కబ్జాలే మా మొదటి ప్రాధాన్యం..

CM Revanth Reddy: ‘హైడ్రా’ హైదరాబాద్ వరకే పరిమితమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, పార్కులు, నాలల కబ్జాలే మా మొదటి ప్రాధాన్యం అన్నారు. ప్రజా ప్రయోజనాలు మాకు ముఖ్యమని తెలిపారు. చెరువులు కబ్జా చేసిన ఎవర్ని వదిలి పెట్టమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్న గ్రామ పంచాయతీ లు కూడా హైడ్రా పరిధిలోనే ఉన్నాయన్నారు. జంట జలాశయాలను పరిరక్షించడమే మా భాద్యత అన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నా కుటుంబ సభ్యులు, బంధువు లు ఉంటే వివరాలు ఇవ్వండి నేనే వచ్చి దగ్గర ఉండి కూల్చివేస్తా అన్నారు. కేటీఆర్ ఫామ్ హౌజ్ లీజ్ తీసుకున్న విషయం ఎన్నికల అఫిడవిట్ లో చూపించారా? అని ప్రశ్నించారు. చూపించకుంటే న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కేటీఆర్ స్నేహితుడు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఫామ్ హౌజ్ కడితే నిబంధనలు ఉల్లంఘించిన ప్రాపర్టీస్ కేటీఆర్ ఎలా తీసుకుంటాడన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్నారు.
Read also: KTR Warning Tweet: మళ్లీ చెప్తున్నా రాసి పెట్టుకో.. విగ్రహాలను తొలగిస్తాం..
మొదటగా మా పార్టీకి చెందిన పళ్ళం రాజు ఫామ్ హౌజ్ కూల్చిందన్నారు. చెరువు శిఖం భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దు. వ్యవసాయం చేసుకుంటే ఇబ్బంది లేదని తెలిపారు. రైతు రుణమాఫీ 2 లక్షల పైన రుణం తీసుకున్న వారు పై మొత్తానికి కడితే రుణమాఫీ అయిపోతుందన్నారు. వాటికి నిధులు కూడా విడుదల చేశామన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రతి ఇంటికి వెళ్లి రుణమాఫీ కానీ వారి లెక్కలు సేకరించి కలెక్టర్ ఇవ్వండని తెలిపారు. హరీష్ రావు, కేటీఆర్ ప్రతి రైతు వద్దకి వెళ్ళండి అన్నారు. రుణమాఫీ అవ్వని లెక్కలు సేకరించి కలెక్టర్ కు ఇవ్వండి తెలిపారు. నాకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రుణమాఫీ విషయంలో సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయకుండా ఉన్నాడు.. హరీష్ రావు దొంగ అని ముందే తెలుసన్నారు. ఆగస్టు 15న రుణమాఫీ చేయాలని విదేశీ పర్యటనలో ఉన్నా మధ్యంతరంగా వచ్చి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసా అన్నారు రేవంత్ రెడ్డి.
Delhi Liquor Case: సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణ సెప్టెంబర్ 11వ తేదీ వాయిదా..