Leading News Portal in Telugu

CM Revanth Reddy : గణేష్ ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష


CM Revanth Reddy : గణేష్ ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

గణేష్ ఉత్సవాల నిర్వహణపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణేష్ నవరాత్రి ఉత్సవాలను సంబంధించి ప్రభుత్వానికి, నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలన్నారు. అందరి సలహాలు, సూచనలు స్వీకరించెందుకే ఈ సమావేశం నిర్వహించామని, నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశిస్తున్నానని ఆయన తెలిపారు. చిత్తశుద్ధి, నిబద్దతో ఉత్సవాలు నిర్వహించేలా జాగ్రత్త వహించండని, నిమజ్జనానికి సంబంధించి ఉత్సవ నిర్వాహకుల నుంచి సహకారం అవసరమన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Pakistan: వాఘా బోర్డర్‌లో కాశ్మీర్ వేర్పాటువాది ఫోటో.. ప్రజల్ని ఏమారుస్తున్న పాకిస్తాన్..

ఏరియాల వారీగా నిమజ్జనానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ప్రతీ ఏరియాలో కోఆర్డినేషన్ కమిటీలను నియమించుకోవాలన్నారు. వీవీఐపీ సెక్యూరీపై ప్రత్యేక దృష్టి సారించాలని, సెప్టెంబర్ 17 తెలంగాణకు చాలా కీలకమైందన్నారు. సెప్టెంబర్ 17న జరిగే రాజకీయ, రాజకీయేతర కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని, హైదరాబాద్ బ్రాండ్ ను మరింత పెంచేందుకు నిర్వాహకుల సహకారం అవసరమన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Constable: ఆసక్తికరంగా వరుణ్ సందేశ్ “కానిస్టేబుల్” మోషన్ పోస్టర్