Leading News Portal in Telugu

Occult Worship: వికారాబాద్ లో క్షుద్ర పూజల కలకలం… కాలేజ్ లో ఆవరణలో ఆనవాళ్లు..


  • వికారాబాద్ జిల్లా బషీరాబాద్ లోని ఓ ప్రైవేటు కాలేజ్ లో క్షుద్ర పూజల కలకలం..

  • కళాశాల ఆవరణలో ముగ్గులు వేసి పూజలు చేసిన ఆనవాళ్లు
Occult Worship: వికారాబాద్ లో క్షుద్ర పూజల కలకలం… కాలేజ్ లో ఆవరణలో ఆనవాళ్లు..

Occult Worship: ఓవైపు టెక్నాలజీ వైపు ప్రపంచం పరుగులు తీస్తుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు కూడా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.. ప్రతీ రోజూ ఏదో ఒక చోట క్షుద్ర పూజలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు ఏకంగా ఓ ప్రైవేటు కాలేజ్ ఆవరణ ముందు క్షుద్ర పూజలు చేసిన ఆలనవాల్లు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ లో కలకలం రేపుతున్నాయి

Read also: Hydra Demolitions: రామ్ నగర్ లో హైడ్రా అక్రమ కూల్చి వేతలు

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ లోని ఓ ప్రైవేటు కాలేజ్ లో క్షుద్ర పూజల కలకలం రేపాయి. రోజూలాగే కాలేజీలకు వచ్చిన ఉపాధ్యాయులకు, విధ్యార్థులు షాక్ కు గురయ్యారు. కళాశాల ఆవరణలో ముగ్గులు వేసి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో భాయందోళనకు చెందారు. ఎప్పుడూ లేని విధంగా కాలేజీ ఆవరణలో పూజలు చేయడం ఏమిటని అనుమానం వ్యక్తం చేశారు. ముగ్గులు వేసి అందులో పసుపు, కుంకుమ ఉండటంతో భయాందోళన చెందుతున్నారు. కాలేజీలో ఎవరైనా రాత్రి వచ్చి ఇలా చేసి వుంటారని భావిస్తున్నారు. దీనిపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు కాలేజీకి చేరుకున్నారు. కాలేజీ ఆవరణలో ముగ్గులు, కుంకుమ, పసుపును చూసి ఆశ్చర్యపోయారు. కాలేజీలో క్షుద్ర పూజలు చేయడం ఏంటని షాక్ తిన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా పూజలు చేశారా…? ఆకతాయిల పనా..? అని ఆరా తీస్తున్నారు. కాలేజీలోని విద్యార్థులకు ప్రశ్నిస్తున్నారు. కాలేజీలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Wipro Fresher: విప్రో ఉద్యోగులకు భారీ షాక్.. వారి నియామకాలు రద్దు..