- జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో కత్తితో భర్త హంగామా ..
-
రాత్రి ఇంటికి ఎందుకు వచ్చావని భార్యనే కత్తితో పొడిచిందని ఆరోపిస్తున్న భర్త.. -
తానే కత్తితో పొడిచుకొని తన చేతిలో కత్తి పెట్టాడని ఆరోపిస్తున్న భార్య..

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో కత్తితో ఓ వ్యక్తి హంగామా సృష్టించారు. తన భార్య కత్తితో పొడిచిందంటూ ఇంటి ముందు కేకలు పెట్టాడు. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Pineapple For Hair: అన్ని జుట్టు సమస్యలకు పైనాపిల్‌తో ఇలా చెక్..
జగిత్యాలకు చెందిన దంపతులు గత కొంతకాలంగా అర్బన్ కాలనీలో నివాసముంటున్నారు. గల్ఫ్ లో భర్త ఉద్యోగం నిర్వహించి ఈ మధ్యనే 20 రోజుల క్రితం గల్ఫ్ నుండి ఇంటికి వచ్చాడు. అయితే కొద్దిరోజులు బాగానే వున్నా వీరిద్దరి మధ్య తరచూ గొడవలు మొదలయ్యాయి. అయితే గత రాత్రి ఇంటికి భర్త వచ్చాడు. దీంతో భార్య భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇంటికి ఎందుకు వచ్చావంటూ తనపై కత్తితో దాడి చేసిందని భర్త ఆరోపించాడు. భార్య కత్తితో పొడవడంతో ఎక్కడ చంపేస్తుందోనని భయపడి ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టానని భర్త శ్రీనివాస్ తెలిపాడు. తనను రక్తపు మడుగులో చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపాడు. అయితే భర్త చేస్తున్న ఆరోపణలు అంతా అపద్దమని, తను అర్థరాత్రి ఇంటికి వచ్చాడని తెలిపింది.
Read also: Gudlavalleru Engineering College Incident: గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో కీలక పరిణామాలు..
తను మంచంపై కూర్చుకుని ఉంటే తన చేతిలో కత్తి పెట్టి.. నన్ను పొడవద్దంటూ గట్టిగా కేకలు వేసుకుంటూ ఇంటినుంచి బయటకు వచ్చాడని భార్య లబోదిబో మంటుంది. తను ఇంటికి రాకముందే కత్తితో ఒంటిపై పొడుచుకుని వచ్చి, తన మీద దాడి కేసు పెట్టాలని చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. భర్త శ్రీనివాస్ రోజు రాత్రి తాగి ఇంటికి వచ్చి గొడవపడతాడని.. అయినా భరిస్తూ వచ్చానని వాపోయింది. ఇప్పుడు తనపై కత్తితో పొడిచానంటూ ఆరోపిస్తున్నాడని తనకు న్యాయం చేయాలని కోరుతుంది. గల్ఫ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇలానే ప్రవర్తిస్తున్నాడని భార్య అంటుంది. వీరిద్దరి కేసులను నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తు తలనొప్పిగా మారింది.
SS Rajamouli: సెప్టెంబరు 13న టికెట్లు తస్కరించేందుకు అంతా సిద్ధం.. రాజమౌళి ట్వీట్ వైరల్!