Leading News Portal in Telugu

Heavy Rains: హైదరాబాద్ ను కమ్మేసిన వాన మబ్బులు.. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు..


  • బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం..

  • రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం..
Heavy Rains: హైదరాబాద్ ను కమ్మేసిన వాన మబ్బులు.. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు..

Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం కారణంగా హైదరాబాద్‌లో ఉదయం నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. దాంతో పగలు చీకట్లు కమ్ముకున్నాయి. రాబోయే 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నేడు భారీ వర్షాలు కురిసే సూచన ఉండటంతో రాష్ట్రానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పది జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్ కు ఐఎండీ అలెర్ట్ చేసింది. నగరానికి భారీ వర్ష సూచన జారీ చేసింది. అవసరం అయితేగానీ బయటకు వెళ్లొద్దని హైదరాబాదీలకు ఐఎండీ సూచన ఇచ్చింది. సిటీకి భారీ వర్ష సూచనతో అధికారులను అలెర్ట్ చేసింది.

Read also: 35 Lakh Stolen: హైదరాబాద్‌ లో దొంగల హల్ చల్‌.. రూ.35 లక్షలు దోపిడీ..

మూసీ పరీవాహక ప్రాంతాలు అలెర్ట్ గా ఉండాలని అధికారుల హెచ్చరించారు. వరద ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. కాగా, అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారేందుకు మరో 24 గంటల సమయం పట్టనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తెల్లవారుజామున చీకటి పడుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అధికారులు కూడా బయటకు రావద్దని సూచిస్తున్నారు.
GAIL Jobs: 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేయనున్న గెయిల్‌..