Leading News Portal in Telugu

Telangana Rains : తెలంగాణకు తప్పిన భారీ వాన గండం.. కానీ


Telangana Rains : తెలంగాణకు తప్పిన భారీ వాన గండం.. కానీ

తెలంగాణకు భారీ వాన గండం తప్పినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో క్రమంగా వాయుగుండం బలహీన పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తూర్పు విదర్భ – రామగుండం దగ్గర వాయుగుండం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో పూర్తిగా వాయుగుండం బలహీన పడనున్నట్లు, ఈ నేపథ్యంలో తెలంగాణలో నేడు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి రాబోయే ఐదు రోజుల తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్‌లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Divorce Rumours: ఐశ్వర్య, అభిషేక్ విడిపోలేదు.. ఇదిగో ప్రూఫ్!