Leading News Portal in Telugu

Medaram Forest: మేడారం అడవుల్లో సుడిగాలుల బీభత్సం.. 50 వేలకు పైగా చెట్లు నేలమట్టం..


  • మేడారం అడవుల్లో సుడిగాలుల బీభత్సం..

  • 8 టోర్నడో తరహా గాలులు కావచ్చు అంటున్న నిపుణులు..
Medaram Forest: మేడారం అడవుల్లో సుడిగాలుల బీభత్సం.. 50 వేలకు పైగా చెట్లు నేలమట్టం..

Medaram Forest: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుమారు 50 వేల చెట్లు నేలమట్టమయ్యాయి. 200 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో పెద్ద ఎత్తున గాలిదుమారం, సుడిగాలుల బీభత్సంతో మహావృక్షాలు సైతం చిగురుటాకుల్లా రాలిపోయినట్లు అధికారుల తెలిపారు. ఈ నెల 1న పరిశీలనకు వెళ్లిన అధికారులు.. ఈదృశ్యాలను చూసి ఆశ్చర్యానికి గురైయ్యారు. టోర్నడోల్లాంటి బలమైన సుడిగాలులే ఈ స్థాయిలో చెట్లను కూల్చివేస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ‘‘టోర్నడోలు ఒక స్పష్టమైన మార్గంలో వెళ్తాయి.

Read also: Hyderabad Hydra: రాష్ట్రంలో హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్..

కుప్పకూలిన చెట్లు కూడా ఒకవైపే పడి ఉన్నాయి. భారీ వృక్షాలు కూడా నేలకొరగడాన్ని బట్టి.. కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులే దీనికి కారణమై ఉండొచ్చు’’ అని వివరించారు. 50 వేల చెట్లు ఒకేసారి నేలకొరగడంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై డీఎ్‌ఫవో రాహుల్‌ జావేద్‌ నేతృత్వంలోని బృందం ఉపగ్రహ డేటా, భారత వాతావరణ శాఖ(ఐఎండీ), నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌ఎ్‌ససీ)తో కలిసి పరిశీలన జరుపుతున్నారు. డి ఎఫ్ ఓ రావుల్ కిషన్. సీసీఎఫ్‌ ప్రభాకర్‌తో కలిసి తాడ్వాయ్‌-మేడారం అడవుల్లో నేలమట్టమైన చెట్లను పరిశీలించారు.
Manjira River: నాలుగో రోజు జలదిగ్బంధంలోనే ఏడు పాయల ఆలయం..