- ఖైరతాబాద్ గణపతి కి తుదిరూపం..
-
స్వామి వారికి కళ్ళు దిద్దుతున్న శిల్పి రాజేందర్.. -
ఎల్లుండి వినాయక చవితి నుంచి స్వామి వారి దర్శనం..

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌లోని 70 అడుగుల ఎత్తైన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహాన్ని ఇవాళ అలంకరించనున్నారు. శిల్పి చిన్న స్వామి రాజేందర్ నేతృత్వంలో దాదాపు 200 మంది కార్మికులు 70 అడుగుల విగ్రహాన్ని అన్ని వివరాలతో ఒకటిన్నర రోజుల్లో పూర్తి చేశారు. ఈరోజు (గురువారం) ఉదయం 10 గంటలకు శిల్పి రాజేంద్రన్ స్వామివారికి నేత్రాలంకరణ చేయనున్నారు. విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన కర్రలను పూర్తిగా తొలగిస్తామని ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ తెలిపారు.
Read also: Uttar Pradesh: అంబులెన్స్‌లో దారుణం.. పేషెంట్ భార్యనే లైంగికంగా వేధించిన డ్రైవర్..!
మరోవైపు ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ను స్థానిక ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ చైర్మన్ దానం నాగేందర్ ఆహ్వానించారు. ఇవాళ ప్రజాభవన్ లో పూజారులు, ఉత్సవ మండలి సభ్యులతో కలిసి ఆయన డిప్యూటీ సీఎంను ఆహ్వానించారు. ఉత్సవాలకు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా డిప్యూటీ సీఎంను కోరారు.
Read also: AI Global Summit 2024: ఏఐ గ్లోబల్ సమ్మిట్.. హాజరైన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు..
కేబీఆర్ పార్కు ఆవరణలో ఏర్పాటు చేయనున్న మల్టీ లెవల్ పార్కింగ్ స్థలాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి బుదవారం పరిశీలించారు. కేబీఆర్ పార్క్‌లో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు పీపీపీ విధానంలో ఈ పార్కింగ్ జోన్ ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఆగస్టు 2న చేసిన తీర్మానం మేరకు స్టాండింగ్ కమిటీ సభ్యులు అధికారులతో కలిసి సంబంధిత పార్కింగ్ స్థలాన్ని సందర్శించారు.
Gold Rate Today: బంగారం ప్రియులకు శుభవార్త.. ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్ రేట్స్ ఇవే!