Leading News Portal in Telugu

Manjira River: నాలుగో రోజు జలదిగ్బంధంలోనే ఏడు పాయల ఆలయం..


  • నాలుగో రోజు జలదిగ్బంధంలోనే ఏడు పాయల ఆలయం..
  • ఆలయం వద్ద ఉగ్రరూపం దాల్చి గర్భగుడిలోనికి ప్రవేశించిన మంజీరా వరద..

  • అమ్మవారి ఆలయాన్ని చుట్టుముట్టిన మంజీరా ఏడు పాయలు..
Manjira River: నాలుగో రోజు జలదిగ్బంధంలోనే ఏడు పాయల ఆలయం..

Manjira River: నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మెదక్ జిల్లాలో ఏడు పాయల ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయం వద్ద మంజీరా వరద ఉగ్రరూపం దాల్చి గర్భగుడిలోనికి ప్రవేశించింది. అమ్మవారి ఆలయాన్ని చుట్టుముట్టిన మంజీరా ఏడు పాయలు. గర్భగుడి మూసేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి అమ్మవారు పూజలు అందుకుంటుంది. మంజీరా బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేయడంతో ఏ క్షణాన అయిన భారీ వరద వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అమ్మవారి ఆలయం చుట్టూ మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. మంజీరా ఏడు పాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతుంది.

Read also: Bhadrachalam: 43 అడుగుల చేరువలో భద్రాచలం వద్ద గోదావరి..

వరద ఉధృతి తగ్గిన తర్వాత యధావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఇక.. మంజీరాకు నక్క వాగు వరద చేరడంతో వనదుర్గ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు నుంచి 13 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. వరదల కారణంగా మంజీరాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వనదుర్గ ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్షాలు తగ్గేంత వరకు ఎవరు ఆలయం వద్దకు రావద్దని పోలీసులు సూచించారు.
Ganesha Stotras: బుధవారం నాడు ఈ స్తోత్రం వింటే విజయం మీ వెంటే