- ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి..
-
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఖైరతాబాద్ గణసాధునికి చేరుకుని తొలి పూజ.. -
రేవంత్‌కి అర్చకులు మంగళ హారతులతో స్వాగతం పలికారు..
CM Revanth Reddy: ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజలో పాల్గొన్నారు. రేవంత్‌కి అర్చకులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. మహా గణపతి తొలిపూజకు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు ఉదయం ఒగ్గుడోలు, పద్మశాలీలందరూ బోనాలు ఎత్తుకున్న మహిళలతో ఊరేగింపుగా వచ్చి ఖైరతాబాద్ గణేశుడికి చేనేత దారం కండువా, గాయత్రి సమర్పించారు. గతేడాది 63 అడుగుల ఎత్తులో వినాయకుడిని ప్రతిష్టించగా.. ఈ ఏడాది 70వ వసంతం సందర్భంగా.. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో పెద్ద గణేశుడిని ప్రతిష్ఠించారు.
Read also: Electric shock: పండగపూట విషాదం…కరెంట్ షాక్ తో యువకుడు మృతి
పది రోజుల పాటు మహా గణపతి భక్తుల పూజలు అందుకుని ఈ నెల 17న ఘనంగా నిమజ్జనోత్సవం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పూజలో పాల్గొంటారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. గణపతిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఖైరతాబాద్ కు రానున్నారు. వీరి కోసం ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వర్షంలో భక్తులు తడవకుండా నిర్వాహకులు ప్రత్యేక షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. గతేడాది దాదాపు 22 లక్షల మంది భక్తులు బడా గణేష్‌ను దర్శించుకున్నారు. ఈ ఏడాది 30 లక్షల మంది భక్తులు వస్తారని ఉత్సవ్ కమిటీ అంచనా వేస్తోంది.
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకత.. ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులు..