- ప్రభుత్వానికి.. పార్టీకి వారధిగా పని చేస్తా- పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
-
పీసీసీలో 60 శాతం పదవులు బీసీ.. ఎస్సీ.. ఎస్టీలకే- పీసీసీ చీఫ్ -
పీసీసీ బీసీకి ఇస్తే.. పూర్తి వాటా దక్కింది అనుకోము- మహేష్ కుమార్ గౌడ్ -
కష్టపడి పనిచేసే వారికి పదవులు వస్తాయి అని రుజువైంది- పీసీసీ చీఫ్ -
కార్యకర్తల శ్రమ వల్ల ప్రభుత్వం.. పార్టీ నిలబడింది- మహేష్ కుమార్ గౌడ్.

ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా పని చేస్తానని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్టీవీతో ప్రత్యేకగా చెప్పారు. పీసీసీలో 60 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకే వస్తాయని అన్నారు. పీసీసీ బీసీకి ఇస్తే.. పూర్తి వాటా దక్కింది అనుకోమని చెప్పారు. మరోవైపు.. కష్టపడి పనిచేసే వారికి పదవులు వస్తాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తాను 1983 నుండి వివిధ పదవుల్లో పని చేశారని పేర్కొ్నారు. గత 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తు్న్నానని చెప్పారు. పీసీసీ పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారని, కానీ.. తాను పార్టీలో కష్టపడి పని చేసిన వ్యక్తిగా ఈ పదవి దక్కిందన్నారు. పార్టీలో తనకున్న గుర్తింపు, పెద్దల వల్లే పీసీసీ పదవి వచ్చిందని తెలిపారు.
కార్యకర్తల శ్రమ వల్ల ప్రభుత్వం, పార్టీ నిలబడిందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. తన ప్రధమ కర్తవ్యం.. ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా పని చేస్తానని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని.. ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసి.. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విధంగా పని చేస్తామని చెప్పారు. మరోవైపు.. బీసీలకు ఏ విధంగా న్యాయం చేయాలో వీలైనంత వరకూ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కులం, మతాలకు అతీతంగా పని చేసే పార్టీ. దేశంలో అన్ని సామాజిక వర్గాలను అక్కున చేర్చుకున్న పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. బీసీ కులగణన చేస్తాం.. బీసీల వాటా బీసీలకు దక్కాల్సిందేనని తెలిపారు.