Leading News Portal in Telugu

Duddilla Sridhar Babu : రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హత కల్గిన రైతులందరికీ రుణమాఫీ


Duddilla Sridhar Babu : రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హత కల్గిన రైతులందరికీ రుణమాఫీ

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హత కల్గిన రైతులందరికీ రుణమాఫీ అవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఆయన పర్యటించారు.. మండలంలో ఇంటివల మరణించిన పలువురి మృతుల కుటుంబాలను పరామర్శించారు. గంగారం మోడల్ స్కూల్, ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెల్సుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..రుణమాఫీ పై కొంత మంది ప్రతిపక్ష నాయకులు సాంకేతిక పరంగా బ్యాంక్ లలో ఏర్పడిన సమస్యలను అనువుగా చేసుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని,అలాంటివి మానుకోవాలని అన్నారు.

Leopard Hulchul: రాజమండ్రి శివారులో చిరుత సంచారం.. అసత్య ప్రచారాలను నమ్మొద్దన్న అటవీ శాఖ!

భారీ వర్షాలతో పంట నష్టం పై అధికారులతో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి, పంట నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిపారు. రాబోయే కాలంలో ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని శ్రీధర్ బాబు అన్నారు. అధిక వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగితే తాము వెంటనే స్పందించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేప్, పార్టీ నేతలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టమన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ పంట నష్టం పై సర్వే చేసి నివేదిక ఇచ్చిన అనంతరం తగిన పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 Ministry of Defence: సుఖోయ్ ఇంజిన్‌ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం.. 26 వేల కోట్ల ఒప్పందంపై సంతకం