Leading News Portal in Telugu

Jangaon Municipal Commissioner: జనగామ మున్సిపల్‌ కమిసనర్‌ కు హైకోర్టు నోటీసులు..


  • జనగామ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు హై కోర్టు నోటీసులు జారీ..
  • ఈ నెల 12న కోర్టు ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది..
Jangaon Municipal Commissioner: జనగామ మున్సిపల్‌ కమిసనర్‌ కు హైకోర్టు నోటీసులు..

Jangaon Municipal Commissioner: జనగామ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమ నిర్మాణం,ఆక్రమణకు సంబంధించిన ఫిర్యాదుపై అలసత్వం ప్రదర్శించారనే అభియోగంపై ఈ నెల 12న కోర్టు ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. యశ్వంతాపూర్ రెవెన్యూ సర్వే నెంబరు కు చెందిన భూమిలో ఓ ఇంటి నిర్మాణం అక్రమమని,స్థల ఆక్రమణ జరిగిందని చర్యలు తీసుకోవాలని మధుసూధన్ అనే వ్యక్తి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు అందాయి. అయితే.. కమిషనర్ స్పందించకపోవడంతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, శాఖ సెక్రటరీ,స్థానిక మున్సిపల్ కమిషనర్ మరొకరిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు హాజరుకాని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 12 న కోర్టులో హాజరుకావాలని జనగామ మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించింది. మున్సిపల్ చట్టం 2019ను అనుసరించి,కమిషనర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని శాఖ ఉన్నతాధికారులకు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది.


Hydra: సున్నం చెరువులో కూల్చివేతలను అడ్డుకున్న ముగ్గురిపై కేసు నమోదు..