Leading News Portal in Telugu

Ganesh Immersion : ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనానికి హైకోర్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.


Ganesh Immersion : ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనానికి హైకోర్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.

గణేష్‌ ఉత్సవ కమిటీలకు తెలంగాణ హైకోర్ట్‌ శుభవార్త చెప్పింది. గణేష్‌ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగర్ గుర్తుకు వస్తుంది. ప్రతి ఏటా నగరం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చే వినాయకులు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తుంటారు. ఖైరతాబాద్ గణేశుడి నుంచి వీధుల్లో ఏర్పాటు చేసే చిన్న బొజ్జ గణపయ్యలను కూడా సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. కానీ.. ఇప్పుడు ఆ సంప్రదాయానికి ఈసారి ఫుల్ స్టాప్ పడుతందని భావించిన వేళ హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ సంవత్సరం కూడా హుస్సేన్‌ సాగర్‌లోనే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకోవడానికి అనుమతించింది. పిటిషనర్‌ కోర్టు ధిక్కరణపై ఆధారాలు చూపించలేకపోవడంతో ఈ మేరకు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను తిరస్కరించింది తెలంగాణ హైకోర్టు. గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని హైకోర్టు సూచించింది. నిమజ్జనం చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్‌ సరికాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

BJP Leader Maheshwar Reddy: 10 మంది ఎమ్మెల్యేల పై స్పీకర్ చర్యలు తీసుకోవాలి..

ఇదిలా ఉంటే.. హైకోర్టు ఆదేశాలకు ముందు.. ట్యాంక్‌బండ్‌ మార్గంలో భారీగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ఫ్లెక్సీలు పెట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ పోలీసుల పేరిట ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే.. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ ఏర్పాటు చేసిన బ్యానర్లు తొలగించునున్నారు అధికారులు.

Duleep Trophy 2024: సెకండ్ రౌండ్.. ఇండియా A కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్..