Leading News Portal in Telugu

Talasani Srinivas Yadav: ఆస్పత్రికి వెళ్లాలంటే హౌస్ అరెస్ట్ అంటారే..? పోలీసులపై తలసాని ఫైర్..


  • తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి వద్ద హైడ్రామా..

  • సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హౌస్ అరెస్ట్..

  • తలసాని నివాసం నుండి బయటకు వెళ్లకుండా మారేడ్ పల్లి పోలీసులు సముదాయింపు..

  • తన ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రి కి వెళ్ళాలి అంటున్న తలసాని..
Talasani Srinivas Yadav: ఆస్పత్రికి వెళ్లాలంటే హౌస్ అరెస్ట్ అంటారే..? పోలీసులపై తలసాని ఫైర్..

Talasani Srinivas Yadav: మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి వద్ద హైడ్రామా వాతావరణం నెలకొంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తలసాని నివాసం నుండి బయటకు వెళ్లకుండా మారేడ్ పల్లి పోలీసులు సముదాయించారు. అయితే.. తన ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్ళాలి తలసాని తెలిపారు. నేను ఎలాంటి సంఘటనలకు పాల్పడడం లేదు… అలా అనుకుంటే నా వెంట ఫాలో కండి అంటూ పోలీసులతో తలసాని అన్నారు. ఏదిఏమైనా బయటకు వెళ్లవద్దు పోలీసులు ఇంట్లోనే ఉండాలని తెలిపారు. పోలీసులు బయటకు వెళ్ళనియకపోవడంతో తన క్యాంపు కార్యాలయం ముందు తలసాని కూర్చున్నారు.

Read also: Danam Nagender: బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశానికి గాంధీ ఇళ్లే దొరికిందా..?

కూకట్‌పల్లిలోని పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ ఇంటి వద్ద ర్యాలీ, సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం నగరంలోని పలువురు బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. మాజీ మంత్రులు హరీశ్‌రావును నానక్‌రామ్‌గూడలో, పీ సబితా ఇంద్రారెడ్డిని శ్రీనగర్‌ కాలనీలో, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెస్ట్‌ మారేడ్‌పల్లిలో గృహనిర్బంధంలో ఉంచారు. బోయినపల్లి లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జూబ్లీహిల్స్ లో మాగంటి గోపినాధ్, సుచిత్ర లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కూకట్పల్లి లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఈసిఐల్ లో ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని బయటకు వెళ్లకుండా పోలీసులు గృహ నిర్భంధం చేశారు. మరోవైపు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి నుంచి ప్రారంభమయ్యే ర్యాలీకి హాజరవ్వాలని బీఆర్‌ఎస్ నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.గాంధీ, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ నివాసాల వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
BRS Meeting: కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి.. గాంధీ ఇంట్లో ముగిసిన కార్యకర్తల సమావేశం