Leading News Portal in Telugu

Harish Rao: భుజం నొప్పిగా ఉంది దవాఖానకు వెళ్లాలి.. హరీష్ రావుతో పాటు ఆసుపత్రికి పోలీసులు


  • AIG ఆసుపత్రికి మాజీ మంత్రి హరీష్ రావు..

  • వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు..

  • నిన్నటి ఆందోళనలో హరీష్‌రావు ఎడమ భుజానికి గాయం..

  • ఆస్పత్రికి వెళ్లడానికి మాత్రమే అనుమతి ఇచ్చిన పోలీసులు..
Harish Rao: భుజం నొప్పిగా ఉంది దవాఖానకు వెళ్లాలి.. హరీష్ రావుతో పాటు ఆసుపత్రికి పోలీసులు

Harish Rao: తీవ్ర భుజం నొప్పితో బాధపడుతున్న హరీష్ రావుకు ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఏఐజీ వద్దకు వెళ్లేందుకు అనుమతి లభించింది. భుజం నొప్పి ఎక్కువగా ఉందని ఆసుపత్రికి నాతో పాటు మీరు కూడా రండి అన్నారు. భుజం నొప్పికి చికిత్స అవసరమని తెలిపారు. అయితే హరీష్ రావుతో పాటు పోలీసులు కూడా ఆస్పత్రికి వెళ్లారు. నిన్న హరీష్ రావు ఎడమ భుజానికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. నిన్న బీఆర్‌ఎస్ ఆందోళనల నేపథ్యంలో హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.

Read also: School Holidays: విద్యార్థులకు పండగే.. ఈనెల 14 నుంచి 17 వరకు స్కూల్స్‌ కి సెలవులు

ఉదయం 11 గంటలకు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు నివాసంలో బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు. అయితే గాంధీ ఇంటికి వెళుతున్న పలు నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కొకపెట్ లోని హరీష్ రావు ఇంటి వద్దకు పోలీసులు భారీగా మోహరించారు. హరీష్ రావు ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. హరీష్ రావును కలిసేందుకు ఎవరిని అనుమతించడం లేదు. హరీష్ రావును కలిసేందుకు వచ్చిన ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. హరీష్ రావును ఇంటికి వచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని ,మాజీ ఎంపీ మాలోతు కవితను పోలీసులు అడ్డుకున్నారు.
Wine Shops Close: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ నెల 17,18న వైన్స్ బంద్..