Leading News Portal in Telugu

Drone Cameras: పక్షులు అనుకున్నారు కదా.. అవి డ్రోన్ కెమెరాలు బాసు..


  • నేడు హైదరాబాద్ మహానగరంలో దేదీవ్యమానంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం .
  • మహానగరంలో అనేక రోడ్లు జన సంద్రంతో కనిపిస్తున్నాయి.
  • ట్యాంక్ బండ్ మీద లక్షల సంఖ్యలో ప్రజలు..
Drone Cameras: పక్షులు అనుకున్నారు కదా.. అవి డ్రోన్ కెమెరాలు బాసు..

Drone Cameras At Ganesh Immersion: నేడు హైదరాబాద్ మహానగరంలో దేదీవ్యమానంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరుగుతోంది.. హైదరాబాద్ మహానగరంలో అనేక రోడ్లు జన సంద్రంతో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెక్రటేరియట్, తెలుగు తల్లి రోడ్డులో ఇసుక వేస్తే రాలనంత జనాలు ఉన్నారు. ఇక మరోవైపు మీడియా కూడా గణేష్ నిమజ్జనాన్ని కవర్ చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. వీటితోపాటు ప్రజల రక్షణకు సంబంధించి పోలీసుల సెక్యూరిటీ డ్రోన్స్ కూడా ఆకాశంలో నిరంతరం వాటి పని చేస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు డ్రోన్స్ సాయాన్ని తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అందరిని అబ్బురపరిచేలా ఓ దృశ్యం ఆవిష్కృతమైంది. ఎవరైనా సరే మొదటిసారిగా ఆ దృశ్యాన్ని చూస్తే అక్కడ ఖచ్చితంగా కొన్ని పక్షులు ఉన్నాయని ఇట్లే భ్రమపడతారు. అయితే వాటిని నిశితంగా పరిశీలిస్తే అక్కడ ఉన్నవి డ్రోన్ కెమెరాలని తెలిసిపోతుంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Bihar Crime: 14 ఏళ్ల బాలికను గన్‌తో బెదిరించి, కారులో తిప్పుతూ అత్యాచారం..

మరోవైపు హైదరాబాద్ లో ఉన్న 70 అడుగుల హైదరాబాద్ మహా వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు భక్తులు, అధికారులు, కమిటీ సభ్యులు, పోలీసులు కష్టపడుతున్నారు. మరోవైపు బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం మరోసారి రికార్డు ధర పలికింది. ఈసారి లడ్డూను కొలను శంకర్ రెడ్డి 30 లక్షల 1000 రూపాయలకు దక్కించుకున్నారు.