Leading News Portal in Telugu

VH- CPI Narayana: తిరుపతి లడ్డులో నాసిరకం నెయ్యి.. వీహెచ్‌, నారాయణ సీరియస్‌..


  • తిరుపతి లడ్డులో నాసిరకం నెయ్యి పై వి. హనుమంతరావు సీరియస్..

  • టీటీడీ కల్తీ లడ్డు వివాదం పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందన..
VH- CPI Narayana: తిరుపతి లడ్డులో నాసిరకం నెయ్యి.. వీహెచ్‌, నారాయణ సీరియస్‌..

VH- CPI Narayana: తిరుపతిలో వెంకటేశ్వర స్వామి లడ్డులో నాసిరకం నెయ్యి వాడినట్లు తెలిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అన్నారు. పంది నేనే, చాప నూనె వాడినట్లు తేలిందని తెలిపారు. రెగ్యులర్ కాంట్రాక్టర్ కాకుండా కొత్త వ్యక్తి కి ఎందుకు ఇచ్చారన్నారు. కల్తీ నెయ్యి పై సీబీఐ విచారణ జరగాలన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇంత దారుణానికి వడి గట్టిందన్నారు. దేవుడు వాళ్ళను క్షమించడన్నారు. వెంటనే మోడీ ,అమిత్ షా సిబిఐ విచారణ కు ఆదేశాలు జారీ చేయాలన్నారు. భక్తులు పరేషాన్ అవుతున్నారని తెలిపారు. దేవుడికి అన్యాయం జరిగింది ఏ పార్టీ అయినా విచారణ జరుగాల్సిందే అన్నారు.

టీటీడీ కల్తీ లడ్డు వివాదం పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. టీటీడీ లడ్డు ప్రసాదం కల్తీ అనేది అంతర్జాతీయంగా చర్చ జరుగుతుందని తెలిపారు. ధర్మారెడ్డి అనే వాడు చాలా దుర్మార్గుడు అన్నారు. ఐఏఎస్ అధికారి ఆయనప్పటికి వైసిపి అనుకూలంగా పని చేశారని తెలిపారు. ఆయన టీటీడీ ఈవో ఆయన వైసిపి నేతగా వ్యవహరించారన్నారు. ఇది లక్షల భక్తుల సమస్య అన్నారు. సుప్రింకోర్టు లడ్డు కల్తీ పై విచారణ చేయాలన్నారు. కల్తీ నిజమా కాదో తేల్చాలన్నారు. లడ్డు తయారీకి వాడే నెయ్యి పబ్లిక్ సెక్టర్ లో ఉన్న డైరీ కి ఇవ్వాలన్నారు. ఊరు, పేర్లు లేని కంపెనీలకు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.

Bandi Sanjay: సీబీఐ విచారణ జరిపించండి.. ఏపీ సీఎంకు బండి సంజయ్ లేఖ..