Leading News Portal in Telugu

Damodar Raja Narasimha: చవకబారు విమర్శలు మానుకోండి.. దామోదర రాజనర్సింహ ట్విట్


  • బీఆర్ఎస్ నేతలు ఇకనైనా ఇలాంటి చవకబారు విమర్శలు మానుకోవాలి..

  • ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం..
Damodar Raja Narasimha: చవకబారు విమర్శలు మానుకోండి.. దామోదర రాజనర్సింహ ట్విట్

Damodar Raja Narasimha: బీఆర్ఎస్ నేతలు ఇకనైనా ఇలాంటి చవకబారు విమర్శలు మానుకోవాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ స్కీమ్లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్, ఇప్పుడు నీతులు చెప్పేందుకు ప్రయత్నించడం సిగ్గు చేటన్నారు. హాస్పిటళ్లకు బకాయిలు విడుదల చేయకుండా, ప్యాకేజీల రేట్లు రివైజ్ చేయకుండా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం అందకుండా చేశారన్నారు. ఈహెచ్ఎస్ కింద ట్రీట్మెంట్ కోసం పోయిన ఉద్యోగులు, పెన్షనర్లను కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు అవమానిస్తుంటే చోద్యం చూశారన్నారు. మా వేతనాల్లో నుంచి కంట్రిబ్యూషన్ ఇస్తాం, స్కీమ్ను సమర్థవంతంగా అమలు చేయండని ఉద్యోగులు, పెన్షనర్లు కోరినా పట్టించుకోలేదని తెలిపారు.

పదేండ్లు మోసం చేసింది చాలదన్నట్టు, ఎన్నికల ముందు హడావుడిగా ఓ డమ్మీ జీవో ఇచ్చి మరోసారి ఉద్యోగులను మోసం చేసే కుట్రలు చేశారన్నారు. మీ కుట్రలు, కుతంత్రాలు తెలుసుకోలేనంత అమాయకులు కాదు ఉద్యోగులు అని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా ఇలాంటి చవకబారు విమర్శలు మానుకోవాలన్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితిని ₹5 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంచినం అని క్లారిటీ ఇచ్చారు. పదేండ్లలో మీరు చేయలేకపోయిన ప్యాకేజీల రివిజన్ను 6 నెలల్లోనే చేసి చూపించిన్నామన్నారు. కొత్తగా 163 రకాల ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు కోరుకున్నట్టుగా వారికి ఆమోదయోగ్యమైన రీతిలో ఈహెచ్ఎస్ను అమలు చేయబోతున్నామని తెలిపారు.
VH- CPI Narayana: తిరుపతి లడ్డులో నాసిరకం నెయ్యి.. వీహెచ్‌, నారాయణ సీరియస్‌..