Leading News Portal in Telugu

CLP Meeting: నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం..


  • నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం..

  • సాయంత్రం 4గంటలకు మాదాపూర లోని ట్రెడెంట్ హోటల్లో భేటీ..

  • స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్న సీఎల్పీ..
CLP Meeting: నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం..

CLP Meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌లో జరిగే సమావేశానికి మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. రేవంత్ రెడ్డి స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించిన తర్వాత తొలిసారిగా జరిగే ఈ సమావేశంలో పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలు తీరుపై సమావేశంలో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

మండల స్థాయి నుంచి కొత్త కమిటీల నియామకం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, వివిధ స్థాయిల్లో పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయం ఏర్పరచడం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. పార్టీ బాధ్యతలతో పాటు జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కొత్త కమిటీ ఏర్పాటు బాధ్యతలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్‌, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను భారీ సంఖ్యలో గెలిపించేందుకు కార్యాచరణ రూపొందించే అంశంపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
Musi River: మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు.. నేటి నుంచి షురూ..