Leading News Portal in Telugu

Hydra Focus: హడలెత్తిస్తున్న హైడ్రా.. నేడు గుట్టల బేగంపేట్ పరిధిలో కూల్చివేతలు..!


  • నిన్న కూకట్‌ పల్లి- సంగారెడ్డిలో అక్రమ నిర్మాణాలను నేల మట్టం చేసిన హైడ్రా..

  • ఇవాళ గుట్టల బేగంపేట్ పరిధిలో కూల్చివేతలు..!
Hydra Focus: హడలెత్తిస్తున్న హైడ్రా.. నేడు గుట్టల బేగంపేట్ పరిధిలో కూల్చివేతలు..!

Hydra Focus: హైదరాబాద్‌లో గత కొద్దిరోజులుగా కూల్చివేతలను ఆపిన హైడ్రా మళ్లీ నిన్న (ఆదివారం) నుంచి కూల్చివేతలు ప్రారంభించింది. హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది. నిన్న కూకట్‌ పల్లి, సంగారెడ్డిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా టీం నేల మట్టం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ గుట్టలలోని బేగంపేట ప్రాంతంలో నేడు హైడ్రామా కూల్చివేతలకు అవకాశం ఉంది. పార్కులోని ఆక్రమణల నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రామా సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో గుట్టల బేగంపేట్ పరిధిలోని స్థానికులు గుండెలు గుబేలు మంటున్నాయి. ఎప్పుడు హైడ్రా టీం వస్తుందో ఇల్లను కూల్చేస్తుందో అన్నట్లు ప్రజలు ఆవేదనతో ఉన్నారు.

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేట సర్వే నంబర్ 164 లోని ప్రభుత్వ భూమిలో అర్థరాత్రి వరకు హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. మూడో భవనం నేలమట్టం‌ కావడంతో హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణ దశలో ఉన్న మరో భారీ భవనాన్ని హైడ్రా అధికారులు బాహుబలి మెషిన్ తో కూల్చివేశారు హైడ్రా టీమ్. అర్థరాత్రి 1గంట వరకు కూల్చివేతలు కొనసాగాయి. వర్షం కారణంగా కాస్త బ్రేక్‌ ఇచ్చిన హైడ్రా అధికారులు. ఆ తరువాత కూల్చివేతలు ప్రారంభం చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేంత వరకు ఎంత అర్ధరాత్రి అయినా సరే పని ముగించుకుని వెళతామని హైడ్రా టీం వెల్లడించింది. దీంతో నిన్న (ఆదివారం) రాత్రి వరకు హైడ్రా కూల్చివేతలు పూర్తిచేసింది. ఇక కూకట్ పల్లి నల్లచెరువులో 16 కమర్షియల్ షెడ్లను కూల్చివేసి నాలుగు ఎకరాలను హైడ్రా నేడు స్వాధీనం చేసుకుంది. మరోవైపు కృష్ణారెడ్డిపేటలో అమీన్ పూర్ మూడు భవనాలను కూల్చి ఎకరం భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
Telangana Rains: బంగాళాఖాతంలో ఆవర్తనం.. గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్‌ హెచ్చరికలు జారీ..