Leading News Portal in Telugu

Congress Ministers: రేపటి నుంచి గాంధీభవన్‌కు మంత్రులు.. బుధవారం దామోదర, శుక్రవారం శ్రీధర్‌బాబు


  • ‘ప్రజాస్వామ్యం- ఇందిరమ్మ రాజ్యం’ నిర్మాణమే ధ్యేయంగా కొత్త సంప్రదాయానికి శ్రీకారం..

  • వారంలో రెండు రోజులు కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులోకి గాంధీభవన్‌లో ఒక్కో మంత్రి
Congress Ministers: రేపటి నుంచి గాంధీభవన్‌కు మంత్రులు.. బుధవారం దామోదర, శుక్రవారం శ్రీధర్‌బాబు

Congress Ministers: ‘ప్రజాస్వామ్యం- ఇందిరమ్మ రాజ్యం’ నిర్మాణమే ధ్యేయంగా కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. వారంలో రెండు రోజులు గాంధీభవన్‌లో ఒక్కో మంత్రి కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండే కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ప్రారంభిస్తున్నారు. నిజానికి ఈ కార్యక్రమం గత శుక్రవారమే ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆ రోజే మంత్రివర్గ సమావేశం ఉండడంతో బుధవారానికి వాయిదా పడింది. . ఇక నుంచి ప్రతి బుధ, శుక్రవారాల్లో గాంధీభవన్‌లో తనతో పాటు ఒక మంత్రి అందుబాటులో ఉంటారని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడతానని చెప్పారు.

రేపు బుధవారం (25న) మంత్రి దామోదర రాజనర్సింహ, 27న శ్రీధర్ బాబు అందుబాటులో ఉంటారు. అక్టోబర్ 4న ఉత్తమ్ కుమార్ రెడ్డి, 9న పొన్నం ప్రభాకర్, 11న సీతక్క, 16న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, 18న కొండా సురేఖ, 23న పొంగులేటి శ్రీనివాస రెడ్డి, 25న జూపల్లి కృష్ణారావు, 30న తుమ్మల నాగేశ్వరావు భేటీ కానున్నారు. ప్రత్యేక రోజులు, సెలవులు మినహా ప్రతి బుధ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వివరించారు. గాంధీ జయంతి సందర్భంగా వచ్చే వారం బుధవారం విరామం ఇచ్చారు. ఆ తర్వాత శుక్ర, బుధవారాల్లో గాంధీభవన్‌లో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు కార్యకర్తలకు సమయం కేటాయిస్తారు.
Hanuman Chalisa: మంగళవారం హనుమాన్ చాలీసా వింటే సిరి సంపదలు..