- మహబూబాబాద్ జిల్లా లో బోల్తాపడిన చాపల లోడ్ తో వెళుతున్న బొలోరో వాహనం..
-
చెల్లాచెదురుగా రోడ్డు పై పడిన చేపలను తీసుకెళుతున్న స్థానికులు..
కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం..

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా మరిపెడ బస్టాండ్ సమీపంలో చేపల లోడ్ తో వెళుతున్న బొలోరో వాహనం బోల్తాపడింది. దీంతో వాహనంలోని చేపలు చెల్లాచెదురుగా రోడ్డు పై పడ్డాయి. అది చూసిన స్థానికులు చేపలు పట్టేందుకు ఎగబడ్డారు. దొరికిన చేపలను పట్టుకుని తీసుకెళ్లారు. అటుగా వెళ్తున్న వాహనదారులు సైతం చేపలు పట్టేందుకు ప్రయత్నించారు. కొందరు దొరికిన చేపలను కవర్లలో వేసుకున్నారు. చేపలు పట్టేందుకు స్థానికులు రోడ్డుపై పెద్ద సంఖ్యలో రాగా.. కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. బోలోరో వాహన డైవర్ లబోదిబో మన్నాడు. బోలోరో వాహన యజమానికి విసయం కాస్త వివరించాడు. చేసేందీ ఏమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడంతో పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికులను వెల్లగొట్టేందుకు ప్రయత్నించారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని సహకరించాలని కోరాడు. అయినా స్థానికులు వినకుండా చేపలు పట్టుకునే పనిలో పడ్డారు. ఇక పోలీసులు కూడా చేసేదేమి లేక చూస్తూ ఉండిపోయారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వేరే రూట్ లో వాహనాలను తరలించారు.
Jr NTR : దేవర RTCక్రాస్ రోడ్ ‘ఆల్ టైమ్ రికార్డ్’.. ప్రభాస్, మహేష్ రికార్డ్స్ గల్లంతు