Leading News Portal in Telugu

Emergency Landing: తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం..


  • శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ -తిరుపతి ఫ్లైట్ అత్యవసర లాండింగ్..
  • సాంకేతిక కారణాల కారణంగా తిరిగి అత్యవసర లాండింగ్..
  • ప్రయాణికులు సురక్షితం..
Emergency Landing: తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం..

Emergency Landing: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి 66 మంది ప్రయాణికులతో తిరుపతి బయలుదేరిన అలయన్స్ ఎయిర్లైన్స్ విమానం 9I 877 సాంకేతిక కారణంగా తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలోనే అత్యవసర లాండింగ్ అయింది. ఉదయం 6.12 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన ఫ్లైట్ తిరిగి 8.17 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టులోనే ల్యాండ్ అయింది. శంషాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ వెంటనే ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట సమీపంలో ఉండగా వెంటనే ATC కేంద్రానికి సమాచారం అందించాడు.

అంతేకాకుండా.. పైలెట్ ప్రయాణిలకు అలర్ట్ చేశారు. భయపడాల్సిన అవసరం లేదని ల్యాండింగ్ సిద్దంగా వున్నామని, ప్రయాణికులు సహకరించాలని కోరారు. శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పైలట్ సమాచారంతో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతించారు. దీంతో పైలట్ విమానాన్ని ఒంటిమిట్ట నుంచి తిరిగి శంషాబాద్ లో ల్యాండ్ చేశాడు. విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు సిబ్బంది వెల్లడించారు. విమానంలో మొత్తం 66 మంది ప్రయాణికులు ఉన్నారని ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానంలో సాంకేతిక లోపం సరి చేసిన వెంటనే తిరుగు ప్రయాణించేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. ప్రయాణికులకు రెస్ట్ రూం ఏర్పాటు చేశామన్నారు.

Hyderabad: బైక్ పై అబ్బాయి ఒడిలోనే అమ్మాయి.. హద్దులు దాటి ముద్దులు..