Leading News Portal in Telugu

V. Hanumantha Rao: భగవంతుడి దగ్గర కూడా అవినీతికి పాల్పడటం దౌర్భాగ్యం..


  • భగవంతుడి దగ్గర కూడా అవినీతికి పాల్పడటం దౌర్భాగ్యం..

  • వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దీక్షకు కూర్చున్నా..
V. Hanumantha Rao: భగవంతుడి దగ్గర కూడా అవినీతికి పాల్పడటం దౌర్భాగ్యం..

V. Hanumantha Rao: భగవంతుడి దగ్గర కూడా అవినీతికి పాల్పడటం దౌర్భాగ్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అన్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దీక్షకు కూర్చున్నానని తెలిపారు. తిరుమల లో జరుగుతున్న ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రపంచంలోనే వెంకన్న లడ్డుకు పవిత్రత ఉంటుందని తెలిపారు. అలాంటి పవిత్రమైన లడ్డులో జంతువుల క్రొవ్వు కలపడం దారుణమన్నారు. ప్రపంచ దేశాలలో వెంకన్న భక్తులు ఉన్నారని తెలిపారు. గతంలో వైసీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందన్నారు. తిరుమలలో దేవుడిపై ఒట్టు వేస్తూ రాజకీయం చేస్తున్నారని తెలిపారు. సీబీఐ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయననారు. నేను చేస్తున్న దీక్షతో అయిన కేంద్ర ప్రభుత్వంలో చలనం రావాలన్నారు. ఈ సమస్య తొందరగా పరిష్కరించాలి… లేకపోతే ప్రజల్లో గందరగోళం పరిస్థితి ఏర్పడుతుందన్నారు. భగవంతుడి దగ్గర కూడా అవినీతికు పాల్పడటం దౌర్భాగ్యమన్నారు. సీబీఐ విచారణ త్వరగా చేసి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Minister Seethakka: ములుగు మున్సిపాలిటీ బిల్లుపై గవర్నర్ జిష్ణు దేవ్ తో సీతక్క భేటీ