Leading News Portal in Telugu

Bandi Sanjay: పవన్ కళ్యాణ్‌కు బండి సంజయ్ మద్ధతు..


  • పవన్ కళ్యాణ్ కి నా పూర్తి మద్దతు- బండి సంజయ్

  • “ఎవరైనా సనాతన ధర్మాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తే..

  • హిందువులమందరం న్యాయబద్ధంగా గళం విప్పుదాం- బండి సంజయ్

  • సెక్యులరిజం అనేది రెండు వైపుల ఉండాలి- బండి సంజయ్.
Bandi Sanjay: పవన్ కళ్యాణ్‌కు బండి సంజయ్ మద్ధతు..

సనాతన ధర్మంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇంద్రకీలాద్రిపై ఈరోజు ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం బాగుండాలి అని పాటుపడుతున్నాం మేం.. సెక్యులరిజం అన్ని వైపుల నుంచి రావాలి అన్నారు పవన్‌ కల్యాణ్. సాటి హిందువులు.. తోటి హిందువులను తిట్టడం ఆక్షేపణీయం అన్నారు. మసీదులో చిన్న అపచారం జరిగితే ఇలాగే మాట్లాడతారా..? హిందువుల పట్ల ఎలా మాట్లాడతారు..? అని ప్రశ్నించారు. సెక్యులరిజం టూవే.. ఒన్ వే కాదు అని సూచించారు. సనాతనధర్మ రక్షణ అనేది గుడికెళ్ళే ప్రతీ హిందువు బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. నా మీద కోర్టులో కేసు లేసుకోండి.. సనాతన ధర్మం గురించి మాట్లాడితే రోడ్లమీదకు లాగుతాం అని హెచ్చరించారు.

ఈ క్రమంలో.. పవన్ కల్యాణ్‌కు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శక్తిమంతమైన మాటలు మాట్లాడారని, సంపూర్ణంగా ఆయనకు మద్దతుగా నిలుస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు. ” ఎవరైనా సనాతన ధర్మాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తే, హిందువులమందరం న్యాయబద్ధంగా గళం విప్పుదాం. సెక్యులరిజం అనేది రెండు వైపుల ఉండాలి… సెక్యులరిజం పేరుతో ఒకరు విలాసాలను అనుభవిస్తుంటే, మేము దెబ్బలు తింటూ కూర్చుంటామని ఆశిస్తే అది జరగదు. మేము మౌనంగా ఉండం.” ఈ మేరకు ఎక్స్ వేదికగా బండి సంజయ్ స్పందించారు. ‘‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్. ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అని రాశారు.