Leading News Portal in Telugu

Eatala Rajendar: రేవంత్ అనాడు మాట్లాడిన ఒక్క మాట కూడా అమలు చేయలేదు


  • సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం..

  • సర్పంచులకు న్యాయం చేస్తానని పీసీసీగా ఉన్నప్పుడు చెప్పాడు..

  • అనాడు రేవంత్ మాట్లాడిన ఒక్క మాట కూడా అమలు చేయలేదు: ఈటల రాజేందర్
Eatala Rajendar: రేవంత్ అనాడు మాట్లాడిన ఒక్క మాట కూడా అమలు చేయలేదు

Eatala Rajendar: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు జరిగాయి. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్పంచులు, గ్రామ పంచాయతీలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తుందని రేవంత్ రెడ్డీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడారు.. బిల్లులు రాక 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని అప్పుడు రేవంత్ అన్నారు.. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అనాడు మాట్లాడిన ఒక్క మాట కూడా అమలు చేయలేదు అని ఆయన మండిపడ్డారు. సర్పంచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయనని పలకరించిన నాథుడే లేడు.. అడ్డదారులు తొక్కి అధికారంలోకి రేవంత్ రెడ్డి వచ్చారు.. సర్పంచుల పెండింగ్ బిల్స్ వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు. దసరాలోపు పెండింగ్ బిల్ల్స్ క్లియర్ చేయాలని ఈటల రాజేందర్ అన్నారు.

లేకుంటే మిమ్మల్ని ఎక్కడికి అక్కడ అడ్డుకునేందుకు సర్పంచులు సిద్దంగా ఉన్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. సర్పంచుల ఆందోళనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తాం.. సర్పంచ్ ల పదవి కాలం పూర్తయ్యి ఏడు నెలలు దాటినా ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు అని ప్రశ్నించారు. పాలక మండలి లేక గ్రామాల్లో చెత్త పేరుకుపోతుంది.. రేవంత్ గ్రామాలను వల్లకాడుగా మార్చారు.. వెంటనే రిజర్వేషన్లు ప్రకటించి సర్పంచు ఎన్నికలు జరపాలి అని కోరారు.