- సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చివేతలపై రంగనాథ్ స్పందన
- ఈ కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు
- కూల్చివేతలపై హైడ్రాకు ముడిపెడుతూ వార్తలు రావడం విచారకరం
- కూల్చివేతలన్నీ హైడ్రాకు ముడిపెట్టొద్దన్న రంగనాథ్

సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చివేతలు హైడ్రా చేపట్టలేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటన విడుదల చేశారు. ఈ కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. దీనిని హైడ్రా కు ముడిపెడుతూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడం విచారకరమని, హైడ్రా ఇలాంటి తప్పుడు వార్తలు ఖండిస్తోందని ఆయన అన్నారు. హైడ్రాను అప్రతిష్టపాలు చేయడానికి కొంతమంది చేస్తున్న ప్రయత్నాలను సామాజిక మాధ్యమాలు అనుసరించవద్దని విన్నవిస్తున్నామన్నారు. హైడ్రా కు సంబంధం లేని ఘటనలను ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ అప్రతిష్టపాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
Electric Scooter: మార్కెట్లోకి మరో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిమీ
సంగారెడ్డి ఘటనలో హోం గార్డ్ కి గాయమై చనిపోతే… హైడ్రా బలి తీసుకుంది అని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడం దురదృష్టకరమని, కూల్చివేతలు అన్నీ హైడ్రా కు ముడి పెట్టవద్దని ఆయన సూచించారు. అంతేకాకుండా… ఇటీవల కూకట్‌పల్లి చెరువు పరిసరాల్లో ఇంటిని కూల్చి వేస్తారేమో అని బుచ్చమ్మ అనే మహిళా ఆత్మహత్య చేసుకోవడాన్ని కూడా హైడ్రాకు ఆపాదించారని, హైడ్రా నోటీసులు కూడా ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. అదిలాబాద్ జిల్లాలో కూల్చివేతలు జరిగిన హైడ్రాకు ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు వస్తున్నాయని, ఔటర్ రింగు రోడ్డు వరకే హైడ్రా పరిధి అనేది అందరూ గ్రహించాలన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.
Uddhav Thackeray: నన్ను, శరద్ పవార్‌ని దెబ్బతీయాలని అమిత్ షా ఆదేశించారు..