Leading News Portal in Telugu

Secunderabad To Goa Trains: సికింద్రాబాద్-గోవా వీక్లి ట్రైన్.. ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..


  • సికింద్రాబాద్-గోవా వీక్లి ట్రైన్ ను ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు..

  • కేంద్ర ప్రభుత్వం తరపున నవరాత్రుల కానుకగా గోవా వీక్లీ రైలు..

  • శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
Secunderabad To Goa Trains: సికింద్రాబాద్-గోవా వీక్లి ట్రైన్.. ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

Secunderabad To Goa Trains: సికింద్రాబాద్-గోవా వీక్లి ట్రైన్ ను ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తరపున నవరాత్రుల కానుకగా.. సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్తున్న ఈ బై-వీక్లీ రైలును ప్రారంభించుకుంటున్న సందర్భంగా కిషన్ రెడ్డి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రైలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరీ ముఖ్యంగా పర్యాటకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండనుందన్నారు. ఇప్పటివరకు.. సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు.. డైరెక్ట్ ట్రెయిన్ ఉండేది కాదన్నారు. వారానికి ఒక రైలు 10 కోచ్ లతో సికింద్రాబాద్ నుండి బయలుదేరి గుంతకల్ కు చేరుకొని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్ళే మరో 10 కోచ్ లతో కలిసి గోవాకు వెళ్లేదన్నారు. దీంతోపాటుగా.. కాచిగూడ – యలహంక మధ్యన వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్ళే 4 కోచ్ లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ – గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారన్నారు. ఇలా సికింద్రాబాద్ – గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయం నా దృష్టికొచ్చిందని తెలిపారు.

Read also: Cyber ​​Criminals: 18 మంది, 319 కేసులు.. సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్..

దీన్ని పరిష్కరించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ గారిని అడగటం.. దీనికి వారు అంగీకరించి.. ఈ కొత్త రైలును ప్రకటించడం సంతోషకరం అన్నారు. వారికి ఈ సందర్బంగా ఈ వేదిక ద్వారా భారత ప్రధాని మొధీ గారికి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నానని తెలిపారు. దాదాపు 20 గంటలపాటు సాగే ఈ ప్రయాణం.. తెలుగు రాష్ట్రాలతోపాటుగా కర్ణాటక ప్రజలకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ మూడు రాష్ట్రాల పర్యాటక రంగాభివృద్ధికి, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతానికి కూడా సికింద్రాబాద్-గోవా ప్రత్యేక రైలు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుందని తెలిపారు. ఇది సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుందన్నారు.
Tata Punch Camo Edition: ‘టాటా పంచ్‌’ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర ఎంతో తెలుసా?