Leading News Portal in Telugu

KTR Testimony: మంత్రి కొండా సురేఖపై కేసులో.. నేడు కేటీఆర్‌ వాంగ్మూలం..


  • మంత్రి కొండా సురేఖపై కేసు..

  • నేడు కేటీఆర్‌ వాంగ్మూలం..

  • నిన్న (మంగళవారం) ట్విటర్ వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్..
KTR Testimony: మంత్రి కొండా సురేఖపై కేసులో.. నేడు కేటీఆర్‌ వాంగ్మూలం..

KTR Testimony: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ (బుధవారం)ప్రజా ప్రతినిధుల కోర్టులో వాంగ్మూలం ఇవ్వనున్నారు. మంత్రి కొండా సురేఖపై వేసిన పరువునష్టం క్రిమినల్ కేసులో.. ఆయన కోర్టుకు హాజరుకానున్నారు. మేజిస్ట్రేట్ శ్రీదేవి ఆదేశాల మేరకు.. ఫిర్యాదుదారులైన కేటీఆర్‌తో పాటు సాక్షులుగా వున్న తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌కుమార్ వాంగ్మూలాలను కూడా కోర్టులో నమోదు చేయనున్నారు. తనపై దాఖలైన ఆరోపణలపై కోర్టుకు హాజరై వివరణ ఇచ్చేందుకు మంత్రి కొండా సురేఖకు అవకాశం కల్పిస్తూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు బుధవారం కోర్టుకు హాజరుకావాలని లంగర్‌హౌస్ పోలీసులు ఆమెకు సమన్లు ​​జారీ చేశారు.

Read also: Group-1 Exam Day 3: తెలంగాణలో మూడో రోజు గ్రూప్-1 పరీక్ష..

నిరాధార ఆరోపణలను వీడే ప్రసక్తే లేదని కొండా సురేఖపై పరువునష్టం దావా అంశంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్ లో ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. తన వ్యక్తిత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిని పిరికిపందలను వదలబోరని కేటీఆర్ అన్నారు. ఇలాంటి నీచమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆయన స్టాంగ్‌ తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా.. మీడియాలో, సోషల్ మీడియాలో ఇలాంటి నీచమైన ప్రచారాన్ని మాత్రం వదలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధిగా చాలా కాలంగా ప్రజా జీవితానికి సంబంధించిన అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నాను. ఇతరులపై ఎప్పుడూ వ్యక్తిగత ఆరోపణలు లేదా నీచమైన వ్యాఖ్యలు చేయవద్దు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నీచమైన వ్యాఖ్యలు చేయడం సబబు కాదని కేటీఆర్ ట్వీట్‌ వేదికగా హెచ్చరించారు. రాజకీయ విమర్శల పేరుతో రూ. 100 కోట్ల పరువు నష్టం దావా గుణపాఠం కావాలి. కోర్టుల్లో నిజం గెలుస్తుందన్న నమ్మకం ఉంది’’ అని కేటీఆర్ ట్విటర్ లో పేర్కొన్నారు.
South Korea Tour: సియోల్ లో AI సిటీని సందర్శించనున్న తెలంగాణ అధికార బృందం..