- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- రేరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం
- ములుగులో గిరిజన యూనివర్శిటీకి ఎకరా రూ.250 చొప్పున భూమి కేటాయింపు

TG Cabinet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర 7వేల పై చిలుకు కోట్ల అప్పు కోసం కేబినెట్ అనుమతిపై చర్చించారు. 30వేల కోట్లు కేంద్ర సంస్థల దగ్గర రుణాలు తీసుకోవడం కోసం..రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని రోడ్లు తనఖా పెట్టడానికై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపుపై చర్చ జరిగింది. ములుగులో గిరిజన యూనివర్సిటీకి ఎకరా 250 రూపాయల చొప్పున భూమిని మంత్రివర్గం కేటాయించినట్లు సమాచారం.