Leading News Portal in Telugu

Secunderabad sub registrar Jyoti was arrested by the police.


  • సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్ట్
  • 14 రోజులపాటు రిమాండ్ విధింపు
  • సుభాష్‌నగర్‌లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేసిన పద్మజారెడ్డి
  • అప్పట్లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేసిన జ్యోతి
  • నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్‌ను పద్మజారెడ్డికి సహకరించిన జ్యోతి.
Hyderabad: పోలీసుల అదుపులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్..

సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో.. 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఓ ల్యాండ్ ఇష్యూకు సంబంధించి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో పద్మజారెడ్డి అనే మహిళ కబ్జా చేసింది.

ఆ సమయంలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేసిన జ్యోతి.. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్‌కు పద్మజారెడ్డికి సబ్ రిజిస్ట్రార్ జ్యోతి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో.. పద్మజా రెడ్డితో పాటు సబ్ రిజిస్ట్రార్ జ్యోతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఈ కేసులో ఇటీవల పద్మజారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.. తాజాగా ఈ కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని అరెస్ట్ చేశారు.