Leading News Portal in Telugu

Elephant Tension in Komaram Bheem: Wildlife Threats and Forest Department Actions


  • మహారాష్ర్ట సరిహద్దు గుండా ఛత్తీస్ ఘడ్ వైపు వెళ్లిన గజరాజు
  • కాగజ్ నగర్ డివిజన్‌లో అశోక్ ఠాకూర్ అనే వ్యక్తి మరో ఏడుగురు వ్యక్తులతో అటవీ శాఖ కేసు
  • పులి పాదముద్రలు గుర్తించడం జరిగింది
Elephant Tension : కొమరం భీం జిల్లాకు తప్పిన ఏనుగు ముప్పు

Elephant Tension : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు ఏనుగు ముప్పు తప్పింది. మహారాష్ట్ర సరిహద్దు గుండా ఛత్తీస్ ఘడ్ వైపు గజరాజు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే.. కాగజ్ నగర్ డివిజన్ లో అశోక్ ఠాకూర్ అనే వ్యక్తితో పాటు మరో ఏడుగురు వ్యక్తులతో అటవీ శాఖ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విద్యుత్ వైర్ పెట్టి అడవి పంది చంపిన కేసులో కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పర్చామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. వన్య ప్రాణులను వేటాడటం నేరం వాటిని కాపాడుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, జిల్లాలో ఏనుగు సంచరిస్తున్నట్టు విషయం తెలిసిందే, ప్రస్తుతం ఛత్తీస్గడ్ రాష్త్రం వెైపు వెళ్ళిందన్నారు. కెరమెరి మండలంలోనీ మహారాష్ట్ర సరిహద్దు లో కొత్తగా ఒక పులి సంచరిస్తుందని, పులి పాదముద్రలు గుర్తించడం జరిగిందన్నారు. కెరమెరి మండలంలోని అడవి ప్రాంతం పులులకు ఆవాసంగా ఉండడంతో మహారాష్ట్ర తడోబా, తిప్పేశ్వర్ నుండి పులులు వస్తున్నాయని, కెరమేరి ప్రాంతంలో చిరుతల సంచారం ఎక్కువగా ఉందన్నారు. ఒక నెలలో 15 నుంచి 20 వరకు ఆవులు,మేకలపై పులి దాడిచేసి చంపిన కేసులు నమోదు అయినాయని, వాటి కొందరు యజమానులకు నష్టారిహారం కూడా అందించడం జరిగిందని అధికారులు వెల్లడించారు.

Triglycerides: గుండెకు ముప్పు కలిగించే ట్రై గ్లిజరైడ్ అంటే ఏమిటి..?