Leading News Portal in Telugu

9th National Ayurveda Day: Key Highlights by Health Minister Damodara Raja Narasimha”


  • ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలో పూర్వీకులు మనకు నేర్పించారు
  • మనం దాన్ని కొనసాగించ లేకపోతున్నాము
  • యోగా.. ఆయుర్వేదం మతానికి సంబంధించిన అంశాలు కాదు : మంత్రి దామోదర
Damodara Raja Narasimha : ఆయుర్వేదం, యోగా మన వేద జ్ఞానం..

Damodara Raja Narasimha : 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డలోని ఆయుర్వేద మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహా పాల్గొన్నారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన 628 మంది పార్ట్ టైమ్ యోగా ఇన్‌స్ట్రక్టర్లకు మంత్రి అపాయింట్‌మెంట్ లెటర్లు అందించారు.. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. ఆయుర్వేదం, యోగా మన వేద జ్ఞానం అని, ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలో పూర్వీకులు మనకు నేర్పించారన్నారు. మనం దాన్ని కొనసాగించ లేకపోతున్నామని, యోగా, ఆయుర్వేదం మతానికి సంబంధించిన అంశాలు కాదన్నారు మంత్రి దామోదర. మానవాళికి సంబంధించిన అంశం. మానవశరీరం, జ్ఞానం, మనస్సుకు సంబంధించిన అంశమన్నారు. ఇప్పుడిప్పుడే దీని ప్రాముఖ్యతను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, పిల్లలకు దీన్ని నేర్పించాలన్నారు మంత్రి దామోదర. యోగా, ఆయుర్వేదను గ్రామాల్లోకి తీసుకెళ్లాలని, యోగా వల్ల కలిగే లాభాలు ఏంటో ప్రజలకు వివరించి, వారికి అవగాహన కల్పించాలన్నారు మంత్రి దామోదర రాజనర్సింహా.

Delivery Agent : బతుకు పోరాటం.. రెండు చేతులు లేకున్నా.. బండి నడుపుతున్న జొమాటో డెలివరీ బాయ్‌

అంతేకాకుండా.. ఆయుష్ డైరెక్టరేట్‌ను సాంక్షన్ చేస్తామని, హైదరాబాద్, వరంగల్‌లోని కాలేజీల్లో ఆయుష్ యూజీ, పీజీ సీట్ల సంఖ్యను పెంచుతామని ఆయన వెల్లడించారు. స్టూడెంట్ల కోసం‌ కొత్త హాస్టల్ భవనాలను నిర్మిస్తామని, వారం రోజుల్లో విద్యార్థుల స్టైఫండ్ చెల్లిస్తామన్నారు. స్టైఫండ్ పెంపు అంశాన్ని పరిశీలిస్తామని, ఇంకో 214 మంది యోగా ఇన్‌స్ట్రక్టర్లను త్వరలో నియమిస్తామన్నారు. ప్రపంచమంతా యోగా, ఆయుర్వేదను గౌరవిస్తోంది. ఆదరిస్తోంది. మనం కూడా ఈ విభాగాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం హెల్త్ సెక్రటరీ క్రిస్టినా 1935లో ఆయుర్వేద కాలేజీ ఏర్పడిందని, 421 ఆరోగ్య మందిర్స్‌లో యోగా టీచర్లను నియమించామన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. పిల్లలకు యోగా అలవాటు చేయాలని, ఆరోగ్య మందిర్స్‌లో యోగా ఇన్‌స్ట్రక్టర్లు ఉచితంగా యోగా నేర్పిస్తారన్నారు.

Kapil Dev – Chandrababu: ఏపీ ముఖ్యమంత్రితో కపిల్ దేవ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..!