Leading News Portal in Telugu

Adilabad MLA Payal Shankar Challenge to Former Minister Jogu Ramanna


  • అక్కడ సీసీఐ ధర ఎక్కవ ఉంది అంటే రాజీనమా చేస్తా
  • మాజీ మంత్రి జోగు రామన్నకు ఎమ్మెల్యే శంకర్ సవాల్
MLA Payal Shankar: మాజీ మంత్రి జోగు రామన్నకు ఎమ్మెల్యే శంకర్ సవాల్

MLA Payal Shankar: మాజీ మంత్రి జోగు రామన్నకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి తక్కువ ధర ఇస్తుందని బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సీసీఐ ఒకే ధర ఉంటుందన్నారు. సీసీఐ గుజరాత్‌లో ఎక్కువ ధర ఉంది అంటే తాను రాజీనామా చేస్తానన్నారు. బీజేపీ ఎంపీ,ఎమ్మెల్యే ఎక్కుడున్నారని అన్న జోగు రామన్న వ్యాఖ్యలకు ఎమ్మెల్యే స్పందించారు. మార్కెట్ యార్డులో రైతులు ఇబ్బంది పడుతుంటే నువ్వెక్కడ ఉన్నావ్ అంటూ.. జోగు రామన్నను ఉద్దేశించి ప్రశ్నించారు. మార్కెట్‌ యార్డ్‌ దిక్కుకు కూడా రాలేదన్నారు. నేను లాలూచీ పడ్డా అన్నావు.. నువ్వు చేసినవి అన్నీ ఆడియోలు ఉన్నాయి.. బయట పెట్టాలా అంటూ వ్యాఖ్యానించారు. నీ గతం గురించి తవ్వాల్సి వస్తుందన్నారు. రైతుల కోసం పోరాటం చేసింది ఎవ్వరో అందరికీ తెలుసని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.