- గాంధీభవన్‌లో బీసీ కులగణనపై సమావేశం
- కులగణనపై కాంగ్రెస్ కమిట్‌మెంట్‌తో ఉందన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

BC Caste Census: గాంధీభవన్‌లో బీసీ కులగణనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగుతున్న సమావేశంలో మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు పాల్గొన్నారు. ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజు సమావేశంలో కులగణన ప్రాధాన్యతను వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి కులగణనపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కులగణనపై కాంగ్రెస్ కమిట్‌మెంట్‌తో ఉందన్నారు. రాహుల్ గాంధీ మాట ప్రకారం గణన జరుగుతుందన్నారు. ఎవరు ఎంత మందో.. వారికి అంత వాటా అని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కుల గణన సక్రమంగా చేస్తామని.. తెలంగాణ రోల్ మోడల్‌గా నిలవబోతుందన్నారు.
కుల గణనకు తెలంగాణ రోల్ మోడల్‌గా మారబోతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. త్వరలో జిల్లాల్లో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. నవంబర్ 5న రాష్ట్ర స్థాయిలో స్టేక్ హోల్డర్స్‌తో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఆ సమావేశానికి రాహుల్ గాంధీని పిలవాలని అనుకున్నామన్నారు. సర్వే ఆధారంగా అవకాశాలు అందేలా చూస్తామన్నారు.సమాజంలో సమస్యలకు పరిష్కారం సర్వేతో దొరుకుతుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కులగణన దేశానికి ఓ సందేశం లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. కులగణన రాజ్యాంగ మూల సూత్రాన్ని కాపాడుతుందన్నారు. రాజ్యాంగంలో సమాన హక్కు చాలా ముఖ్యమైనదని చెప్పారు. కులగణన చేస్తేనే సమాజంలో అందరికి సమాన హక్కులు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు.