Leading News Portal in Telugu

Minister Jupalli Krishna Rao Discusses Caste Census and Political Challenges in Telangana


  • ఏ సామాజిక వర్గం ఎంత ఉన్నారో నిష్పత్తి ప్రకారం వివరాలు నమోదు చేస్తున్నాం
  • నవంబర్ 31 లోగా కులగణనను రేవంత్ రెడ్డి చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు
  • కులగణన దామాషా ప్రకారమే రాజకీయ పదవులు కూడా అందుబాటులో ఉంటాయి : జూపల్లి కృష్ణారావు
Jupally Krishna Rao : కేటీఆర్, హరీష్ రావు ప్రతి అంశం పట్ల రాజకీయం చేస్తున్నారు

సోనియాగాంధీ రాహుల్ గాంధీ ఖర్గే అగ్రనేతలందరూ మాట ఇచినట్టే కుల గణన చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ సామాజిక వర్గం ఎంత ఉన్నారో నిష్పత్తి ప్రకారం వివరాలు నమోదు చేస్తున్నామని, నవంబర్ 31 లోగా కులగణన ను రేవంత్ రెడ్డి చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. కులగణన దామాషా ప్రకారమే రాజకీయ పదవులు కూడా అందుబాటులో ఉంటాయని, కేటీఆర్ హరీష్ రావు ప్రతి అంశం పట్ల రాజకీయం చేస్తున్నారన్నారు. రాజకీయ లబ్దికోసం ఉన్నదాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధిపొందుతున్నారని, మంత్రిగా ఉన్న నేనే మూసీ రివర్ బెల్ట్ లో ఉన్నాను ఏసీలో ఉన్న నాకే పరిసరాలు కంపు కొడుతుందన్నారు మంత్రి జూపల్లి. మూసీ పరివాహక ప్రాంతాల్లో దుర్బర జీవితం అనుభవిస్తున్న వాళ్ళు మంచి గాలి ఆస్వాదించవద్ద అని ఆయన అన్నారు. పది నెలల్లో 50 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించాం.. మీ హయాంలో డీఎస్సీ వేశారా అని ఆయన ప్రశ్నించారు.

Burn Accident: టపాసుల వల్ల కాలిన గాయాలైతే.. ఈ వంటింటి చిట్కాలు పాటించండి

అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక మెతుకు చాలు అని, ప్రభుత్వం మూడు నెలల్లో కూలుతుంది అంటూ బిఅరెస్ మాట్లాడిందన్నారు. ఆర్టీసీని మూసేసి అడుక్కుతినే స్థాయికి చేసాడు అది కేసీఆర్ నైజమన్నారు మంత్రి జూపల్లి. ధనిక రాష్ట్రం అంటూ బిఆర్ఎస్ నేతలు అంటున్నారు అప్పుల కుప్పల ఎందుకు మారిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు బిఆర్ఎస్ పార్టీకి అంత ఫండ్ ఎక్కడి నుండి వచ్చాయన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీకి లేనన్ని నిధులు టిఆర్ఎస్ పార్టీకి అవినీతి అక్రమల మార్గంలోనే వచ్చాయని, బీఆర్ఎస్ కి కర్రుకాల్చి వాతపెట్టారు ఎంపీ ఎలక్షన్లో 0 సీట్లు వచ్చాయి అయినా బిఅరెస్ నేతల ప్రవర్తనలో మార్పు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.

C Voter Survey Maharashtra: మహారాష్ట్ర ప్రజలు ఎవర్ని సీఎంగా కోరుకుంటున్నారు..?