Leading News Portal in Telugu

Mayonnaise has been banned in Telangana


  • తెలంగాణ రాష్ట్ర వైద్య.. ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం
  • రాష్ట్రంలో మయోనైజ్‌ బ్యాన్
  • ప్రకటించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
  • రాష్ట్రంలో నూతనంగా 3 ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు.. 5 మొబైల్‌ ఫుడ్‌ సేఫ్టీ ల్యాబ్స్‌
Mayonnaise Ban In Telangana : తెలంగాణలో మయోనైజ్ బ్యాన్.. ఎందుకంటే?

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఎంతో ఇష్టంగా తినే మయోనైజ్‌ని బ్యాన్ చేసింది. ఈ మయోనైజ్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు సమీక్ష నిర్వహించారు. అనంతరం దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలున్నాయని గుర్తించారు. దీంతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తాజాగా దీన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రాష్ట్రంలో ప్రముఖ హోటళ్లు, ఫుడ్‌స్టాళ్లలో దాడుల అనంతరం మయోనైజ్‌పై దర్యాప్తు ప్రారంభించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

READ MORE: New GST Rules: జీఎస్టీ రిటర్న్‌లో మార్పులు.. ఇకపై ఇలా చేయలేరు!

అయితే.. మయోనైజ్ అనేది అదొక చట్నీ లాంటి పదార్థం. దాన్ని పచ్చి గుడ్లతో, ఇతర ఇంగ్రిడియంట్స్ తయారు చేస్తారు. ఈ మయోనైజ్ ని షవర్మాలో, మొమోస్ లకు కలిపి తినేందుకు వాడతారు. హైదరాబాద్‌లో ఫేమస్ ఫుడ్స్‌లో ఒకటైన షావర్మాలో కూడా దీన్ని అధికంగా వినియోగిస్తారు. దీన్ని మండి బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌లు, ఇతరత్రా ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకుని తింటారు. ఇటీవల జరిగిన ఘటనలతో బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం అప్రమత్తమైంది. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ హోటళ్లు తీరు మారట్లేదంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు ఆ పదార్థాన్ని నిషేధించేందుకు అనుమతి కోరింది.

READ MORE: Nimmala Ramanaidu: ప్రపంచం మొత్తం పోలవరం వైపు చూస్తోంది..

రాష్ట్రంలో ఇటీవల మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. చాలా మంది రోగాలపాలయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీపై నిఘా పెంచింది. కాగా.. రాష్ట్రంలో నూతనంగా 3 ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు, 5 మొబైల్‌ ఫుడ్‌ సేఫ్టీ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని దామోదర రాజనర్సింహా ఆదేశించారు. కల్తీ ఆహారపదార్థాల్ని తీసుకొని పలువురు తీవ్ర అనారోగ్యం పాలవుతోన్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.