Leading News Portal in Telugu

Wanaparthy District Excise Superintendent Prabhu Vinay Suspended


  • వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సస్పెండ్‌
  • గత 4 నెలల నుంచి విధులకు డుమ్మా
  • హాజరు రిజిస్టర్.. ఫైళ్లను ఇంటివద్దకే తెప్పించుకుని సంతకాలు
Suspended : ఎక్సైజ్ అధికారి ప్రభు వినయ్ సస్పెండ్

Suspended : వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే..ప్రభు వినయ్ కుమార్ గత 4 నెలల నుంచి విధులకు హాజరు కాకుండా హాజరు రిజిస్టర్ , ఫైళ్లను ఇంటివద్దకే తెప్పించుకుని సంతకాలు చేస్తూ జీతం తీసుకుంటున్నాడని, సర్వీస్ రిజిస్టరులో పుట్టినతేదీ మార్చుకుని, చట్టవిరుద్ధంగా సర్వీస్ పొడిగించుకోవటంతో పాటు ..సీనియారిటీ లిస్టులో అక్రమాలకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు అక్రమాలకు పాల్పడ్డారని బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ వనపర్తి జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేయడంతో ప్రభు వినయ్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపిన అధికారులు అతని సస్పెండ్ చేశారు. తన ఫిర్యాదుపై స్పందించి ప్రభు వినయ్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వానికి ఈ సందర్బంగా రాచాల కృతజ్ఞతలు తెలిపారు.

Nimmala Ramanaidu: ప్రపంచం మొత్తం పోలవరం వైపు చూస్తోంది..