Leading News Portal in Telugu

Mahesh Goud on Rahul Gandhi’s Vision for India’s Future and Caste Census Plans



  • బీసీ కులగణనపై గాంధీ భవన్‌లో సమావేశం. పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ అధ్యక్షతన సమావేశం
  • కులగణనపై కాంగ్రెస్‌ కమిట్‌మెంట్‌తో ఉంది
  • రాహుల్‌ గాంధీ మాట ప్రకారం బీసీ కులగణన
  • ఎవరు ఎంత మందో వారికి అంత వాటా అని రాహుల్‌ చెప్పారు : పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌
Mahesh Kumar Goud : రాహుల్ గాంధీ ఈ దేశానికి ఫ్యూచర్

Mahesh Kumar Goud : రాహుల్ గాంధీ ఈ దేశానికి ఫ్యూచర్ అని, ఎవరు ఎంత మందో.. వారికి అంత వాటా అని తేల్చాలని రాహూల్ గాంధీ ఆలోచన అని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. కుల గణన నిస్పక్ష పాతంగా నిర్వహిస్తామని, రాహుల్ గాంధీని పిలిచాం వస్తా అన్నారని ఆయన తెలిపారు. నవంబర్ 5 లేదంటే 6 వ తేది రాహుల్ గాంధీని పిలుస్తామని మహేష్ గౌడ్ తెలిపారు. హైకోర్టు సరిదిద్దుకోండి అంటే సరిదిద్దుకుంటామని, అన్ని వర్గాల వివరాలు బయటకు వస్తాయిన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన కి అనుగుణంగా సర్వే అని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు లేవన్న ఫీలింగ్ ఉందని, చర్యలు తీసుకోవాలని, గత ప్రభుత్వం మాదిరిగా తొందర పాటు చర్యలు ఉండవన్నారు. అచీ తూచి చర్యలు తీసుకుంటామన్నారు.

Burn Accident: టపాసుల వల్ల కాలిన గాయాలైతే.. ఈ వంటింటి చిట్కాలు పాటించండి

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుల గణన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కులగ‌ణ‌నపై సాహసోపేత నిర్ణ‌యం తీసుకున్నారు. దీనికి పార్టీ సంపూర్ణంగా అండగా నిలబడి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నవంబర్ 2న 33 జిల్లాల్లో కులగణనపై డీసీసీ అధ్యక్షులు సమావేశాలు ఏర్పాటు చేసి పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల‌న్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గ‌ణ‌న‌పై ఎలాంటి అనుమానాలు ఉన్నా గాంధీభవన్‌లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమాచారం ఇస్తామన్నారు.

Periyar: తమిళనాడులో ఎవరూ చేయలేని పని ‘‘విజయ్’’ చేశాడు..