Leading News Portal in Telugu

CM Revanth Reddy Financial Assistance to Rural Girl


  • గిరిజన బాలిక సాయిశ్రద్ధకు ముఖ్యమంత్రి ఆర్థిక సాయం
  • ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన గిరిజన బాలిక
  • ఆర్థిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితి
  • ఆపన్నహస్తం అందిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: గిరిజన బాలిక సాయిశ్రద్ధకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం

CM Revanth Reddy: గిరిజన బాలిక సాయిశ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. కుమురం భీం జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ.. ఎంబీబీఎస్ లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది. ప్రభుత్వ విద్యాలయాలలో చదువుకొని నీట్‌లో సీటు సంపాదించి ఆర్థిక స్థోమత కారణంగా చదువు మధ్యలోనే ఆపేయాల్సి వస్తోందని బాలిక తల్లిదండ్రులు వాపోయారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ బిడ్డ డాక్టర్ అయ్యేందుకు సహకరించాలని కోరారు.

దీనికి సంబంధించి వార్తను ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. డాక్టర్‌ కావాలనుకుంటున్న ఆ బాలికకు భరోసా ఇస్తున్న అంటూ స్పెషల్ పోస్ట్ చేశారు. తన దృష్టికి వచ్చిన వెంటనే డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సీఎంకు సాయిశ్రద్ద, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.