Leading News Portal in Telugu

V. Hanumantha Rao Comments On BJP Leaders Over Sardar Vallabhbhai Patel Birth Anniversary


  • గాంధీ భవన్‌లో ఇందిరా గాంధీ వర్ధంతి.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

  • పూలమాలవేసి నివాళులర్పించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. మాజీ ఎంపీ వీహెచ్.. ఎంపీ అనిల్

  • ప్రపంచంలోనే ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరొందారు- మహేష్ కుమార్

  • సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం బీజేపీ నేతలకి గుర్తు లేదా- వీహెచ్

  • రాజకీయాల కోసమే బీజేపీ నేతలకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తొస్తాడు- వీహెచ్.
V. Hanumantha Rao: రాజకీయాల కోసమే సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తొస్తారా..?

హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఇందిరా గాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు, ఎంపీ అనిల్ యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరొందారని అన్నారు. దేశం సురక్షితంగా ఉండాలని ఉగ్రవాదుల తూటాలకి ఇందిరాగాంధీ బలయ్యారని తెలిపారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న హయాంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆమెని అనుసరిస్తూ ల్యాండ్ రిపామ్స్ తీసుకొచ్చారు పీవీ నరసింహారావు అని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ మంచి స్నేహితులు అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్న వ్యక్తి ఇందిరాగాంధీ అని అన్నారు. దేశానికి సేవ చేయడంలో భాగంగా ఉగ్రవాదుల చేతిలో చనిపోయారు.. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళ్లు అర్పిస్తున్నామని తెలిపారు. దేశ ఐక్యత కోసం ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించారని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం బీజేపీ నేతలకి గుర్తు లేదా అని వీహెచ్ ప్రశ్నించారు. రాజకీయాల కోసమే బీజేపీ నేతలకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తొస్తాడు అని విమర్శించారు.