- కొమురం భీం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత
-
ఆయిల్ ట్యాంకర్ లో గంజాయి సరఫరా -
రాష్ట్ర సరిహద్దు దాటే క్రమంలో పట్టుకున్న వాంకిడి పోలీసులు -
250 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు.

పుష్ప సినిమా తరహాలో పోలీసులను పక్కదారి పట్టించేందుకు ఖతర్నాక్ ప్లాన్ వేశారు. ఆయిల్ ట్యాంకర్‌లో పెట్టి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారు. ఆయిల్ ట్యాంకర్ వాహనంలో మూడు గదులను ఏర్పాటు చేశారు. అందులో మధ్య భాగంలో గంజాయి ప్యాకెట్లు పెట్టి తరలిస్తున్నారు. ఏపీ నుంచి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు యధేచ్చగా గంజాయి అక్రమ రవాణా చేశారు.
పోలీసులను బురిడీ కొట్టిస్తూ పుష్ప సినిమా తరహాలో గంజాయిని తరలిస్తున్న ముఠాను కొమురం భీం జిల్లా వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్ర సరిహద్దు దాటే క్రమంలో పోలీసులు చాకచక్యంగా దొరకబట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తుండగా జిల్లా ఎస్పీకి సమాచారం వచ్చింది. దీంతో.. చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ట్యాంకర్‌లో ఉన్న సుమారు 250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అవుతుంది.. దీనికి వెనుకున్న పాత్రధారులు సూత్రధారులు ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. అనుమానం రాకుండా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారన్నా.. పక్కా సమాచారంతో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు.