- వికారాబాద్ జిల్లా దోమ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం
-
8వ తరగతి మైనర్ బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారం -
దోమ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు -
పోలీసుల అదుపులో నలుగురు మైనర్లు -
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కామాంధుల తీరులో మార్పు రావడం లేదు. ఇదిలా ఉంటే మైనర్లు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
వికారాబాద్ జిల్లా దోమ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 8వ తరగతి మైనర్ బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా.. ఈ ఘటనపై దోమ పోలీసు స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Nimmala Rama Naidu: జగన్ కు ఘాటు కౌంటర్ ఇచ్చిన మంత్రి నిమ్మల