Leading News Portal in Telugu

Fire broke out in many places in Hyderabad


  • హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 18 లో అగ్నిప్రమాదం..

  • సికింద్రాబాద్ లోని ఆర్పీ రోడ్డులోరి మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం..

  • మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం..
Fire Accident: హైదరాబాద్ లో అగ్నిప్రమాదం.. పూజ చేసి బయటకు వెళ్ళగానే చెలరేగిన మంటలు..

Fire Accident: హైదరాబాద్ లో పలు చోట్ల అగ్నిప్రమాద ఘటనలు కలకలం రేపాయి. నగరంలోని పలు చోట్లు ఒక్క సారిగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఫైర్ సిబ్బందితో అగ్ని ప్రమాద ఘటన వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా క్షణాల్లో హాజరై మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. అయితే నగరంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలతో నగర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 18 లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ లోని నాల్గవ అంతస్తులోని ఫ్లాట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో అపార్ట్మెంట్ లో వున్నవారు ఫైర్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు చెలరేగడానికి గల కారణం.. ఫ్లాట్ ఓనర్ ఉదయం ఫ్లాట్ లో పూజ చేసి బయటకు వెళ్లాడు. వెళ్లే సమయంలో బాల్కనీ డోర్ ను తెరిచి వెళ్లాడు. దీంతో గాలికి పూజ చేసిన చోట దీపం పెట్టడంతో ఫ్లాట్ లో మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు.

Read also: Manchu Vishnu : కన్నప్ప విడుదలపై క్లారిటీ లేదప్ప..

మరోవైపు సికింద్రాబాద్ లోని ఆర్పీ రోడ్డులోరి మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధి లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ గోదాముపై క్రాకర్స్ పడటంతో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటా హుటిన చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. రమేష్ ఎలక్ట్రికల్ అనే షాపు పైనే గోదాము వుండటం, ఆ పక్కనే నివాస గృహాలు కూడా ఉండటంతో భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాహాని జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలాన్ని హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీ దాస్ పరిశీలించారు.

Read also: LPG Price 1 Nov : దీపావళి రోజు సామాన్యుడికి షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధరలు

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీ సాయి సరిత డెంటల్ క్లినిక్ ముందు ఉన్న ట్రాన్స్ఫారం దగ్గర షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ తో వైర్లు సర్వీస్ వైర్లు తెగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపులు మూసి ఉండడంతో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సకాలంలో సంఘటాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Crime News: రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. కత్తుల దాడిలో ముగ్గురు మృతి!