Leading News Portal in Telugu

Heavy rains in Telugu states


  • ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

  • తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు భారీ వర్షాలు

Rain Alert: ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు (శుక్రవారం) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్ర కోస్తాలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉందని చెప్పారు. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Read also: Fire Accident: హైదరాబాద్ లో అగ్నిప్రమాదం.. పూజ చేసి బయటకు వెళ్ళగానే చెలరేగిన మంటలు..

తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నిన్న (గురువారం) తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీఎస్‌డీఎంఏ ప్రకటించింది.
Diwali Celebrations: దీపావళి వేడుకల్లో అపశృతులు.. 48 మందికి గాయాలు.. 9 మందికి సీరియస్